సిబ్బంది నిర్లక్ష్యంతో జగిత్యాల ప్రభుత్వ మాత శిశు అరోగ్య కేంద్రంలో నవజాత శిశువులు తారుమారు అయ్యారు. ఈ ఘటన పై బంధువుల ఆగ్రహం వ్యక్తం చేయగా.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు ఆర్ఎంఓ. బీర్పూర్ మండలం.. మంగేలా గ్రామానికి చెందిన ప్రసన్న పురిటి నొప్పులతో ఎంసిహెచ్ లో చేరింది. సోమవారం ప్రసన్నతో పాటు మరో మహిళకు డాక్టర్లు డెలివరీ చేశారు.
ఆస్పత్రి సిబ్బంది శిశువుల చేతికి ఉన్న ట్యాగ్స్ చూసుకోకుండా ఒకరి బేబీని మరొకరికి ఇచ్చారు. పొరపాటున గుర్తించి ఎవరి పిల్లలను వారికి అప్పగించారు. ఈ ఘటనపై ప్రసన్న భర్త సతీష్ ఆగ్రహం వ్యక్తహ్మ్ చేసాడు. అధికారులకు ఫిర్యాదు చేద్దామంటే ఆస్పత్రిలో ఉన్న నెంబర్లుకు కాల్ చేస్తే స్పందించడం లేదంటూ మండిపడ్డారు. ఇక శిశువులు తారుమారు అయిన మాట వాస్తవమేనన్న RMO.. పిల్లల చేతికి ఉన్న ట్యాగ్ చూసుకోకుండా సిబ్బంది బంధువులకు అప్పగించారని తెలిపారు. అలాగే సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.