జూన్ 28న పీవీ నరసింహారావు జన్మదినం సందర్భంగా ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశానికి విభిన్న రంగాల్లో పీవీ అందించిన సేవలను చిరస్మరణీయంగా గుర్తుంచుకునేలా ఆయన శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని.. 28న హైదరాబాద్ లోని పీవీ జ్ఞానభూమితోపాటు దాదాపు 50దేశాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని కెసీఆర్ తెలిపారు. వీటి నిర్వహణ కోసం 10కోట్లను తక్షణమే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ సంగతులు అలా ఉంటే… ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ కెసీఆర్ ముందు కొత్త డిమాండ్ ఉంచింది.
భారత్ – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరులైన జవాన్లకు “అమర జవాన్లకు కాంగ్రెస్ సలాం” పేరుతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ జెండాలు చేతపట్టి మహాత్ముల విగ్రహాలవద్ద మౌన దీక్షలు చేపట్టాయి. ఈ క్రమంలో గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో జరిగిన కార్యక్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో… కాంగ్రెస్ పార్టీ నేతలు కొత్త డిమాండ్ లు చేశారు. ఇవి కేసీఆర్ కు కష్టమైనవి కాదు, క్లిష్టమైనవీ కాదు! కాబట్టి.. కేసీఆర్ ఈ డిమాండులను పరిగణలోకి తీసుకుంటారని అనుకుంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న “రైతు బంధు” పథకానికి మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహరావు పేరు పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ డిమాడం చేసింది. ఇది సహేతుకంగా ఉందా లేదా అనే విషయం కాసేపు పక్కన పెడితే… మరో డిమాండ్ టీపీసీసీ నుంచి వచ్చింది. అదేమిటంటే… పీవీ సొంత గ్రామం వంగర. ఇది వరంగల్ జిల్లా అర్బన్ పరిధిలోకి వస్తున్నందున ఆ జిల్లాకు పీవీ నరసింహరావు పేరు పెట్టాలని. ఇది చాలా సహేతుకంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో… కేసీఆర్ ఎలా స్పందిస్తారు అనేదానిపై ఆసక్తి నెలకొంది!