కొత్త రేషన్ కార్డులను ఫిబ్రవరిలో అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెలాఖరులోగా రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలను అమలు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందిస్తామన్నారు. ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటే చేస్తామని స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క చైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు అవుతుంది. సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం, నేను ఉన్నానని వివరించారు. ఇప్పటివరకు కోటీ 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి….భూ సమస్యలు, రేషన్ కార్డుల కోసం 20 లక్షలు దరఖాస్తులు గ్యారంటీలను అప్పుడే అమలు చేయాలని ప్రతిపక్షాలు నిలదీయడం సరికాదని వెల్లడించారు.