ప్రజాభవన్ కారు ప్రమాదం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన షకీల్‌ కుమారుడు

-

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. బారికేడ్లు ధ్వంసం చేసి హల్ చల్ చేయడమే కాకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా తన స్థానంలో డ్రైవర్ ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడు. దీనికి సహకరించిన పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు.

అయితే ఈ కేసులో తన కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నించిన షకీల్ పైనా పోలీసులు చర్యలు చేపట్టారు. సాహిల్ దుబాయ్ కు పరారయ్యాడని గ్రహించిన పోలీసులు అతడిని రప్పించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. నిందితుడు సాహిల్ తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని పిటిషన్ వేశాడు. పోలీసులు కావాలనే తన పేరును నిందితుడిగా చేర్చారని.. ప్రత్యేక్ష సాక్షిగా ఉన్న కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసిఫ్‌ను మొదట నిందితుడిగా చేర్చారని పిటిషన్ లో పేర్కొన్నాడు. తన పేరును చెప్పించేలా పోలీసులు అతడిపై ఒత్తిడి చేశారని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news