కీసర తహసీల్దార్ నాగరాజును కస్టడీ కోరుతూ ఏసీబీ పిటీషన్ వేసింది. నాలుగు రోజుల పాటు నలుగురు నిందితులను కస్టడీలోకి ఇమ్మని ఏసీబీ కోరింది. అయితే కస్టడీకి అనుమతి ఇవ్వొదంటూ నిందితుల తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. నిందితులు నాగరాజు, శ్రీనాథ్ , ఆంజిరెడ్డి, సాయి రాజ్ లను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తోంది. నాగరాజు వచ్చిన తర్వాత బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయనున్నారు. ఇక ఏసీబీ సోదాల్లో నాగరాజు అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బయట పడుతోంది.
తన అక్రమాలకు అడ్డు తగలొద్దని ఉన్నతాధికారులను నాగరాజు మచ్చిక చేసుకున్నట్టు చెబుతున్నారు. జిల్లా ఉన్నత అధికారులకు సకల సౌకర్యాలను నాగరాజు ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. గతంలో మేడ్చల్ లో పనిచేసిన ఒక్క అధికారికి శామీర్ పేట్ లో ఓ గెస్ట్ హౌస్ ను గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సకల సౌకర్యాలతో విశాలవంతమైన గెస్ట్ హౌస్ నిర్మించి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏసీబీ సోదాల్లో బయటపడిన గెస్ట్ హౌస్ డాక్యుమెంట్స్, రాజకీయ, ఉన్నత అధికారులతో సన్నిత సంబంధాలు నడిపినపినట్టు తెలుస్తోంది. సెటిల్మెంట్ విలువను బట్టి ఉన్నతాధికారులకు నజరానాలు ఫిక్స్ చేసేవారని అంటున్నారు. ఈ కేసులో ఉన్నతాధికారుల పాత్ర మీద కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.