కరెంటు సంస్కరణల విషయంలో అప్పట్లో చంద్రబాబుతో కేసీఆర్ విభేదించారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కేసీఆర్ మొదలు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ మొత్తం విద్యుత్ లో 40 శాతం వ్యవసాయ రంగానికి వినియోగిస్తుందని.. జానా రెడ్డి 24 గంటలు ఇవ్వడం సాధ్యం కాదు అని అసెంబ్లీలో అన్నారు …ఆ తరవాత ఆయన వెనక్కి తగ్గారని తెలిపారు.
కానీ కేసీఆర్ 24 గంటల వ్యవసాయ రంగం కు విద్యుత్ సరఫరా చేసి చూపించారని కొనియడారు. అవగాహన లేని కాంగ్రెస్ నేతలు సబ్ స్టేషన్ ల దగ్గరకు వెళ్ళి లాగ్ బుక్ లు చూస్తున్నారని.. ఫైర్ అయ్యారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని కరెంట్ ను పట్టుకుని షాక్ కు గురి అయ్యిందని.. కాంగ్రెస్ కు కరెంట్ పై ఏమైనా విధానం ఉందా ? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు…సచ్చేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతలు కరెంట్ పై తలో మాట మాట్లాడతారు… దేశంలో 24 గంటలు వ్యవసాయ రంగం కు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.