పార్టీ మార్పులపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

-

తమ పార్టీ నేతలను కాంగ్రెస్, బీజేపీలో చేర్చుకోవడం పై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుక్కల్ని, నక్కల్ని గుంజుకొని మీరు ఆహా, ఓహో అనుకోవచ్చు. మా ఎమ్మెల్యేలను తీసుకోవడం చీఫ్ పాలిటిక్స్ అన్నారు. రాజకీయాలు చేస్తూ.. పోతే ప్రజలు ఏం కావాలి..? రాజకీయాలు చేయడానికి మేము రెడీ.. చాలా మందిని పాతరేశాం అన్నారు కేసీఆర్.

రైతుల పక్షాన మాట్లాడే వారు ఎవ్వరూ లేరనుకుంటున్నారా..? బోనస్ ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఒకరిద్దరూ చిల్లర గాళ్లు పోతే పార్టీకి నష్టం లేదన్నారు. సీఎం కి ఢిల్లీకి పోవడమే సరిపోతుంది. మంత్రులు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 100 రోజుల్లో రైతులు ఏడ్చే పరిస్థితికి వెళ్తారని తాను అనుకోలేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం.. 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు తెలిపారు. ఈ పరిస్థితికి ప్రభుత్వ వైఖరికి కారణమని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version