Telangana: పాఠశాలల్లో యూనిఫాం, షూ, బుక్స్, స్టేషనరీ అమ్మకూడదంటూ హైదరాబాద్ డీఈఓ ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర/CBSE/ ICSE పాఠశాల ప్రాంగణంలో యూనిఫారాలు, షూ & బెల్ట్ మొదలైనవాటిని విక్రయించకూడదని… కోర్టు ఆదేశాల ప్రకారం, పాఠశాల కౌంటర్‌లో పుస్తకాలు/నోట్ పుస్తకాలు/స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే, వాణిజ్యేతరంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలని పేర్కొన్నారు.
ప్రైవేట్ పాఠశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్ అంటే స్టేట్/CBSE/ICSE పాఠశాలలో యూనిఫారాలు, షూ & బెల్ట్ మొదలైనవాటిని అమ్మకుండా చూసుకోవాలన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం, పాఠశాల కౌంటర్‌లో పుస్తకాలు/నోట్ పుస్తకాలు/స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే, వాణిజ్య రహితంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలని స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.