తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలంగాణ ప్రజలు. ముఖ్యంగా తాగునీటి సమస్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. అటు రైతులకు సాగునీరు కూడా అందించలేక విఫలమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కానీ వీటన్నిటిని పట్టించుకోకుండా… కాలేశ్వరాన్ని బాగు చేయడం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కెసిఆర్ పై అధికారం తీర్చుకునేందుకు కాలేశ్వరం ప్రాజెక్టు రిపేరు చేయడం లేదని సమాచారం.
దీని ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు డ్యాములు అలాగే ప్రాజెక్టులు ఎండిపోతున్నాయి. అటు మిడ్ మానేరు చుక్క నీరు లేకుండా అడుగట్టింది. గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఎండాకాలం, వర్షకాలంతో సంబంధం లేకుండా మిడ్ మానేరు ప్రాజెక్ట్ నీళ్లతో కలకలలాడింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎఫెక్ట్ వల్ల క్షిణించింది మిడ్ మానేరు. సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు ప్రాజెక్టు చెట్లు ఎండి, నేల బీడువారి ఎడారిని తలపిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.