దళిత బంధు కాదు.. ఇది బీర్స్ బంధు.. ఈటల సంచలన వ్యాఖ్యలు..!

-

 తెలంగాణలో దళితబంధు ప్రారంభించిన తర్వాత హుజురాబాద్ లో మాత్రమే ఇస్తున్నారు. తప్ప రాష్ట్ర వ్యాప్తంగా మోచీ, రెళ్లి, సింధు, డక్కలి, బుడగజంగాలు, మస్టి, మంగ కులాలకు ఫలితాలు అందడం లేదని.. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. దళిత బంధుపై హుజురాబాద్ లో దళితులు చేస్తున్న ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. దళితులు కనీసం ఉండటానికి ఇల్లు కావాలని కోరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దళితులు విద్యకు నోచుకోవడం లేదని.. కటిక పేదరికంలో ఉన్నారని తెలిపారు. రెండు లక్షల కోట్లతో రాష్ట్రమంతా దళిత బంధు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ముందుగా వీరిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

 

హుజురాబాద్ లో 17,700 కుటుంబాలుంటే.. ఇప్పటికీ 14 వేల కుటుంబాలకు పూర్తిస్థాయిలో దళితబంధు అందలేదన్నారు. ఇది ఒక ఫేక్ పథకమని విమర్శించారు. తానే స్వయంగా కుర్చీ వేసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తానన్న కేసీఆర్ ముందుగా పేదరికంలో ఉన్నవారికి ఈ పథకం అందజేయాలన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈ జాతిలో నిలబడాలన్న.. జాతుల సమస్యలు పరిష్కారం కావాలన్నా వారి ప్రతినిధి కూడా చట్టసభలో ఉండాలి అని చెప్పారు. కానీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చట్టసభలు అసెంబ్లీ మెట్లు ఏనాడు ఎక్కని జాతులు ఎన్నో ఉన్నాయన్నారు. కాబట్టి అసెంబ్లీలో వీరికి అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. జీవితాంతం కొట్లాడుతున్నా వారి బ్రతుకులు  మారలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news