BJP ఎమ్మెల్యే రాజాసింగ్ కు నోటీసులు

-

Notices to BJP MLA Raja Singh: హైదరాబాద్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు మంజూరు చేశారు. రాజాసింగ్ భద్రత కోసం ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారును ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ఈ కారును వాడుకోకుండా తన పర్సనల్ కారును వాడుకుంటున్నాడు. దీంతో పోలీసులు రాజాసింగ్ కు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం కేటాయించిన కారును, భద్రత సిబ్బందిని ప్రతిరోజు వాడుకోవాలని రాజాసింగ్ కు పోలీసులు సూచనలు చేశారు.

Rajasingh

తరచుగా రాజాసింగ్ కు ఇతరుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న కారణంగా అతను ఒంటరిగా తిరగడం ప్రమాదకరమని పోలీసులు చెబుతున్నారు. తన భద్రతను దృష్టిలో పెట్టుకొని సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఆదివారం రోజున సాయంత్రం మంగళ్ హాట్ పోలీసులు రాజాసింగ్ కు నోటీసులు జారీ చేశారు. పోలీసుల సూచనల వరకు రాజాసింగ్ భద్రత సిబ్బందిని, బుల్లెట్ ప్రూఫ్ కారును వాడుకుంటారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news