తెలంగాణలో 60 రోజుల వరకు నోటిఫికేషన్ బంద్.. సీఎం సంచలన ప్రకటన..!

-

తెలంగాణలో 60 రోజుల వరకు నోటిఫికేషన్ విడుదల చేయకూడదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా  సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ పై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.

ఎట్టి పరిస్థితుల్లో గడువులోపే రిపోర్టు ఇవ్వాలని.. మంత్రులు, అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. రిపోర్టు ఇచ్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. 24 గంటల్లో కమిషన్ కు కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలన్నారు. పాత నోటిఫికేష్లనకు ఎస్సీ వర్గీకరణ వర్తించదని.. ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరో రెండు నెలల వరకు తెలంగాణలో కొత్త నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో నిరుద్యోగులు నిరాశ చెందకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని సిలబస్ కు కేటాయించుకుంటే.. నోటిఫికేషన్ విడుదలైన తరువాత మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version