కేంద్ర క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ములుగు జిల్లాలో కేంద్రయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ మిగులు జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది.
తెలంగాణకు పసుపుబోర్డు, గిరిజన యూనివర్సిటీ, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా పసుపు బోర్డు కోసం రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఆందోళన చెందుతున్నారు. బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా కృష్ణా నీటి కోసం కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరోవైపు ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు. దీంతో రూ.100 పెరిగింది.