Telangana : ఎల్లుండి నుంచి నర్సుల డ్యూటీలు బంద్

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నర్సులు బిగ్‌ షాక్‌ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. తమను రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు ఈనెల 17 నుంచి సమ్మె చేయనున్నారు.

ఈ సమ్మెలో 2600 మంది స్టాఫ్ నర్సులు, 4500 మంది ANMలు, 550 మంది ఫార్మాసిస్టులు, 620 మంది ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొననుండగా… ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వీరంతా గ్రామాల్లో క్షయ, మలేరియా, డెంగీ టెస్టులు చేయడంతో పాటు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇక అటు సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు సీఎం కేసీఆర్. అలాగే సింగరేణి కార్మికులకు దసరా మరియు దీపావళి బోనస్గా 1000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని కీలక ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version