యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిత్యాన్న ప్రసాదం సదుపాయాన్ని ఆదివారం నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా వెయ్యి మంది భక్తులకు అన్నదానం సదుపాయం కల్పిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి భాస్కర్‌రావు వెల్లడించారు. ఇప్పటి వరకు 600 మంది భక్తులకు నిత్యాన్న ప్రసాదం కల్పిస్తున్నామని, ఇక నుంచి మరో 400 మందికి పంపిణీ చేస్తామని వెల్లడించారు. స్థానిక భక్తులకు ప్రతి మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి అరగంట పాటు దైవదర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని, వారు గర్భాలయంలోకి ప్రవేశించవచ్చని పేర్కొన్నారు.
ఆదివారం రోజున ఏకాదశిని పురస్కరించుకుని యాదాద్రీశునికి 4,600 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే రూ.2,30,000 ఆదాయం సమకూరిందని ఈవో తెలిపారు. యాదాద్రి కొండపై ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని.. దీనికి భక్తులు, స్థానికులు, వ్యాపారులు సహకరించాలంటూ ఈవో భాస్కర్‌రావు కోరారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీయాదగిరి లక్ష్మీనరసింహా స్వామి కల్యాణకట్టలో ఆదివారం రికార్డ్ స్థాయిలో భక్తులు తలనీలాలు సమర్పించారు. క్షేత్ర సందదర్శనకై వచ్చిన భక్తుల్లో 4600 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కు తీర్చుకున్నారు.