సిరిసిల్లను వెంటాడుతున్న ఓమిక్రాన్.. బాధితుడి త‌ల్లి, భార్య కు క‌రోనా

తెలంగాణలో ని రాజ‌న్న‌సిరిసిల్ల జిల్లాను ఓమిక్రాన్ భ‌యం వెంటాడుతుంది. ఇటీవ‌ల దుబాయ్ నుంచి వ‌చ్చిన జిల్లా వాసికి ఓమిక్రాన్ వ‌చ్చింది. అయితే అత‌న్ని అధికారులు హైద‌రాబాద్ లోని టిమ్స్ ఆస్ప‌త్రికి త‌రలించారు. అయితే అత‌ను దుబాయి నుంచి వ‌చ్చిన త‌ర్వాత దాదాపు 62 మందిని క‌లిసాడు. దీంతో అత‌ని ప్రైమ‌రీ కాంటాక్ట్ లీస్ట్ 62 ఉంది. ఆ 62 మంది శాంపిల్స్ ను సేక‌రించి కరోనా టెస్టులు నిర్వ‌హిస్తున్నారు. అయితే అందులో ఓమిక్రాన్ బాధితుడి తల్లికి, భార్య కు క‌రోనా పాజిటివ్ రావడం తో జిల్లా లో ఓమిక్రాన్ టెన్ష‌న్ వాతావర‌ణం నెల‌కొంది.

బాధితుడి త‌ల్లి, భార్య కు కరోనా పాజిటివ్ రాగ‌.. వారి శాంపిల్స్ ను ఓమిక్రాన్ స్ప‌ష్ట‌త కోసం హైద‌రాబాద్ లోని జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. అయితే ఓమిక్రాన్ బాధితునికి ప్రైమ‌రీ కాంటాక్ట్ ఉన్న 62 మందిని అధికారులు హోం ఐసోలేష‌న్ లో ఉంచారు. అలాగే వీరిని క‌లిసిన బంధువుల‌ను కూడా హోం ఐసోలేష‌న్ లో ఉండాల‌ని సూచించారు. అయితే ఈ 62 మంది ప్రైమ‌రీ కాంటాక్ట్ ల‌లో ఎంత మందికి ఓమిక్రాన్ వ‌స్తుందో అనే టెన్ష‌న్ వాతావ‌ర‌ణం జిల్లా లో నెలకొంది.