వారానికి ఒక రోజు సెలవు కార్మికుల పోరాట ఫలితమే : సీఎం రేవంత్ రెడ్డి

-

వారానికి ఒక రోజు సెలవు కార్మికుల పోరాట ఫలితమేనని తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్మిక దినోత్సవం వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో గత పదేళ్లు ఆర్థిక దోపిడి జరిగిందని.. లక్ష రెండు వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఖర్చు చేశారు. పేద ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్, అసంఘటిత రంగ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ సాధనలో కార్మికుల పాత్ర మరువలేనిది అన్నారు.

ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోకండి. ఒక కుటుంబమే రూ.7లక్షల కోట్లు అప్పు చేసింది. కేసీఆర్ చేసిన అప్పులు చెల్లించడానికి లక్షా 2వేల కోట్లు అప్పులు చేసినట్టు తెలిపారు. ఏడాదికి 58వేల ఉద్యోగాలు ఇచ్చాం. గుజరాత్ లోనైనా ఏడాదిలో 58వేల ఉద్యోగాలు కల్పించారా.? అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే తెచ్చిన అప్పులు సరిపోతున్నాయని వెల్లడించారు. సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news