కేసీఆర్ చేసిన అప్పులు చెల్లించడానికే లక్షా 2వేల కోట్లు అప్పు తెచ్చా : సీఎం రేవంత్ రెడ్డి

-

కేసీఆర్ చేసిన అప్పులు చెల్లించడానికే లక్షా 2వేల కోట్లు అప్పు తెచ్చానని  సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రవీంధ్రభారతిలో జరిగిన మే డే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వారానికి ఒక రోజు సెవు కార్మికుల పోరాట ఫలితమే అన్నారు. తెలంగాణలో ఆర్థిక మాంద్యం తక్కువగా ఉందన్నారు. సింగరేణిలో ఔట్ సోర్సింగ్ కార్మికులకు మొదటిసారి మనమే బోనస్ ఇచ్చామని.. సింగరేణిని  పదేళ్లు నిర్వీర్యం చేశారని తెలిపారు. కారుణ్య నియమాకాలు సరళీకృతం చేశామని.. ఒక కుటుంబమే 7 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. 

ఢఛ

కార్మికుల పట్ల ఎప్పుడైనా అనుకూలంగా మాట్లాడారా..?వాళ్లు లక్ష రెండు వేల కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు ఇచ్చాడు. కానీ కట్టిన మూడేళ్లకే కూలిపోయిందని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఏ పథకం అయినా ఆగిందా..? అని ప్రశ్నించారు. ఖజానా అంతా లూటీ చేసినా ఏ పథకం ఆగలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేద ప్రజల ఇంట్లో సన్నబియ్యం ఇస్తున్నామని.. గుజరాత్ లో కూడా ఏడాదిలో 58వేల ఉద్యోగాలు ఇచ్చారా..? నేను ఇచ్చిన మనం దివాలా తీశాం.. కేసీఆర్ కుటుంబం మాత్రం కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news