మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న విచారణ

-

మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమా ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ కి డ్రగ్స్ మాఫియా తో లింకులు ఉన్నాయని పోలీసు విచారణలో బయటపడింది. తాజాగా ఈ కేసులో నార్కోటిక్స్ బ్యూరో విచారణ కొనసాగుతోంది. సినీ ఫైనాన్సర్ వెంకట్ రత్నా రెడ్డి వాట్సాప్ లో కీలక విషయాలు బట్టబయలయ్యాయి. బాలాజీ, వెంకట్ రత్నారెడ్డి కలిసి డ్రగ్స్ పార్టీలు చేసినట్లు గుర్తించారు.

18 మందికి డ్రగ్స్ ను అమ్మకాలు చేసినట్లు విచారణలో వెల్లడించారు బాలాజీ, వెంకట్. ఆ 18 మంది ఎవరు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. గతంలో సినీ నిర్మాత కృష్ణ ప్రసాద్ అరెస్టు తర్వాత మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు బయటపడ్డాయి. కృష్ణ ప్రసాద్ లిస్టులో సినీ ప్రముఖులు, రాజకీయ, ఇతర రంగాల వ్యక్తులకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణ ప్రసాద్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు పేర్లు జాబితా అప్పట్లో సిద్ధం చేసినప్పటికీ.. దర్యాప్తుకు సిద్ధమైన సమయంలో పై స్థాయి నుండి పోలీసులపై ఒత్తిడి వచ్చింది.

దీంతో కృష్ణ ప్రసాద్ వ్యవహారంలో విచారణ నిలిచిపోయింది. ఇప్పుడు బాలాజీ, వెంకట్ వ్యవహారంలో డ్రగ్స్ వినియోగించిన 18 మంది జాబితాను పోలీసులు సిద్ధం చేశారా.. ? అన్నది తెలియాల్సి ఉంది. మరోసారి నిందితుల్ని కస్టడీకి తీసుకొని విచారణ చేయాలని నార్కోటిక్ బ్యూరో భావిస్తోంది. అలాగే కృష్ణ ప్రసాద్, సినీ ఫైనాన్సర్ వెంకటరత్నం రెడ్డి, బాలాజీకి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news