మార్కెట్ లో మళ్ళీ ఉల్లి ధర పైపైకి వెళ్తుంది. బహిరంగ మార్కెట్ లో ఉల్లి కిలో రూ.50 పలుకుతుంది అంటే మనం అర్ధం చేసుకోవచ్చు. అలాగే రైతు బజారులో కిలో ఉల్లి రూ.42 నుంచి రూ.45 పలుకుతుంది. అయితే ఎప్పుడైనా సెప్టెంబర్ సమయంలో పెరిగే ఉల్లి ధరలు ఇప్పుడు ఆగస్టులోనే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మహారాష్ట్రలో ఉల్లి పంటదెబ్బ తినడంతో.. కర్నూలు ఉల్లికి భారీగా డిమాండ్ పెరిగింది.
దానికి తోడు కర్నూలు జిల్లాలోను ఉల్లి సాగు విస్తీర్ణం రోజు రోజుకి తగ్గిపోతుంది. మొత్తం 30 వేల హెక్టార్లలో పాండే ఉల్లి పంట.. ఇప్పుడు కోవాలం 9 వేల హెక్టార్లలో మాత్రమే సాగు అవుతుంది. వర్షాలు లేక ఉల్లి దిగుబడి తక్కువ అయ్యేనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కర్నూలు ఉల్లి మార్కెట్ లో క్వింటాలు రూ.2,500 నుంచి రూ.3,500 వరకు ధర పలుకుతుంది. అయితే ఈ రేట్లు రాను ఆరోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. పంట చేతుకి వచ్చే సమయంలో భారీగా పడుతున్న వర్షాల వల్ల ఉల్లి మురిగి పోయే అవకాశాలు ఉన్నాయి.