ప్రతిపక్ష హోదా కేసీఆర్‌ కాకుండా వేరేవారు తీసుకోవాలి : రాజగోపాల్ రెడ్డి

-

ఒక్కరోజు విరామం తర్వాత శాసనసభ సమావేశాలు తిరిగి ఇవాళ ప్రారంభం అయ్యాయి. శాసనసభలో 19 డిమాండ్లపై చర్చ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత డిమాండ్లపై మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ పద్దులను ప్రవేశపెట్టారు. సీఎం తరఫున మంత్రులు పద్దులు ప్రవేశపెట్టారు. అనంతరం పద్దులపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చను ప్రారంభించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేసింది. రాష్ట్ర విభజన సమయంలో అధిక విద్యుత్‌ను తెలంగాణకు యూపీఏ ప్రభుత్వం కేటాయించింది. జనాభా ప్రాతిపదికన కాకుండా అవసరాల మేరకు విద్యుత్‌ కేటాయించారు. సభకు రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఏందుకు? ప్రతిపక్ష హోదా కేసీఆర్‌ కాకుండా వేరేవారు తీసుకోవాలి. విద్యుత్‌ అవకతవకలపై కమిషన్‌ వేసి దర్యాప్తు చేస్తున్నాం. మేము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చెప్పిండి సరిదిద్దుకుంటాం. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్‌ ప్రభుత్వం. అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news