ప్రభుత్వం ఆరు గ్యారంటీలో అమలులోకి రాబోతున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా పిలుస్తున్నామని, గతంలో పాలకులు ఏం చేశారు అనేది మాకు అనవసరమన్నారు. మేము మాత్రం అందరితో మాట్లాడి అందరిని పిలుస్తున్నామని ఆయన వెల్లడించారు. వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడి మేము మాట్లాడేటప్పుడు వేదిక దిగి నినాదాలు చేయడం ఏంటి.. అని ఆయన మండిపడ్డారు. పేదలకు పథకాలు అందొద్దు అనేదా మీ ఆలోచన అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు బైకాట్ చేయడం ఏంటి..? కొత్త పద్ధతి తెస్తున్నారని ఆయన ద్వజమెత్తారు.
ఇదిలా ఉంటే.. ఈనెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలని, కాంగ్రెస్ క్యాడర్ పెద్దఎత్తున పాల్గొనాలని అన్నారు. ప్రభుత్వం 28వ తేదీన వచ్చేనెల 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమాలు జరుగుతాయని ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు సేవలాందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విషయంలో కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి పనిచేయాలని సూచించారు.