వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో పాదయాత్ర చేస్తున్నారు. వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెయ్యి మంది విద్యార్థి, యువత పాదయాత్ర చేయనున్నారు. సిద్దిపేట నియోజకవర్గం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం నుండి విద్యార్థి, యువత పాదయాత్ర ప్రారంభమైంది. అమరవీరులకు నివాళులు అర్పించి, పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి 2 నిమిషాలు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించి.. జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.

ఇక అటు భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవాలకు సిద్దమవుతున్నాయి కార్లు. మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో 25 అంబాసిడర్ కార్లు భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవాలకు సిద్దమవుతున్నాయి. ఈ నెల 27న వరంగల్ సభకు 25 కార్లతో వెళతాం అంటున్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మారబోయిన రవి యాదవ్.
వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెయ్యి మంది విద్యార్థి, యువత పాదయాత్ర
సిద్దిపేట నియోజకవర్గం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం నుండి ప్రారంభమైన విద్యార్థి, యువత పాదయాత్ర
అమరవీరులకు నివాళులు అర్పించి, పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి 2 నిమిషాలు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించి.. జెండా… pic.twitter.com/C8Zj6NYiCf
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2025