తెలంగాణ గాంధీ సీఎం కేసీఆర్‌: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

-

గాంధేయ విధానాలకు బీజేపీ సర్కార్ తూట్లు పొడుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని మోదీ అన్ని అవాస్తవాలే చెప్పారని మండిపడ్డారు. ధాన్యం కొనేందుకు 27 వేల కోట్లు ఇస్తే టన్నుల కొద్దీ ధాన్యం ఎలాం కొంటారని ప్రశ్నించారు. గాంధీ సిద్ధాంతాలకు అనగుణంగా గ్రామస్వరాజ్యాన్న సాధించి తెలంగాణ గాంధీగా కేసీఆర్ మారారని కొనియాడారు. పాలమూరులో ప్రధాన మంత్రి ప్రసంగంపై పల్లా తీవ్రంగా ధ్వజమెత్తారు.

“గాంధీ సిద్దాంతాలతో రాష్ట్రాన్ని కేసీఆర్‌ సాధించారు. గాంధీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ పల్లెలు మారాయి. తెలంగాణ గాంధీ సీఎం కేసీఆర్‌. పాలమూరు సభలో ప్రధాని మోదీ అబద్ధాలు మాట్లాడారు.గాంధేయ విధానాలకు మోదీ తూట్లు పొడిస్తున్నారు. రాష్ట్రంలో చుక్క నీరు ఇవ్వలేదని ప్రధాని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ది లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పూర్తి చేశాం. 2014లో 24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండింది. ప్రస్తుతం 3 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండుతుంది. ఒక్క చుక్క నీరు ఇవ్వకుంటే ఇంత ధాన్యం పండేదా?” – పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.

Read more RELATED
Recommended to you

Latest news