గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతిరూపాలు: కేసీఆర్‌

-

ఈరోజు మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మహాత్ముడిని స్మరించుకుంటున్నారు. ఆయన సేవలను.. సత్యమార్గాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ గాంధీజీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రానికి, జాతి నిర్మాణానికి గాంధీజీ అందించిన అమూల్యమైన సేవలను చేసిన త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

సత్యమేవ జయతే అనే విశ్వాసం ప్రేరణగా దేశ ప్రజలకు గాంధీజీ అందించిన ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యాచరణ, విజయాల స్పూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, అనంతర స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధితో, పునరుజ్జీవం చెందిన కులవృత్తులతో బలోపేతమైన గ్రామీణ ఆర్థికాభివృద్ధితో ఆసరానందుకుంటున్నపేదల పెద్దల చిరునవ్వులతో,.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతి రూపాలుగా నిలిచాయని సీఎం తెలిపారు. గాంధీజీ సిద్ధాంతాలను కార్యాచరణను జీవన విధానంలో భాగం చేసుకుని స్వీయ నియంత్రణ అనుసరణలతో ముందుకు సాగడమే ఆయనకు మనమనిచ్చే ఘనమైన నివాళి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news