వేతనం రాక పంచాయితీ కార్యాలయం ఉద్యోగి ఆత్మహత్య !

-

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేతనం రాక పంచాయితీ కార్యాలయం ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా అల్లాదుర్గంకు చెందిన బోయిని కుమార్ (28) గ్రామ పంచాయతీ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

Panchayat office employee commits suicide after not receiving salary

సకాలంలో వేతనాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడగా ఈ నెల 21న అర్ధరాత్రి తన ఇంటిలో పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఉస్మానియాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… ఈ కేసు ను దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news