పేపర్ లీకేజ్ కేసు.. సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు విచారణ

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు  దేశవ్యాప్తంగా  ఎంతటి సంచలనం సృష్టించిందో దాదాపు అందరికీ తెలిసిందే. అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు  పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో సీబీఐతో దర్యాప్తు చేయాలని న్యాయస్థానంలో పిల్ దాఖలైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ లీకేజ్ ఘనటను దర్యాప్తును సీబీఐ కి అప్పగించాలని  పిటిషన్ ను దాఖలు చేశారు. అయితే బక్క జడ్స దాఖలు చేసిన పిటీషన్ ని ఆగస్టు 16న  హైకోర్టు విచారణకు స్వీకరించింది. అనంతరం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ కార్యాలయ ఉద్యోగులు ప్రవీణ్, రాజశేఖర్ పేపర్ లీకేజీకి పాల్పడినట్టు గుర్తించారు అధికారులు. దీంతో భారీ భారీ లావాదేవీలు జరిగినట్టు ఇప్పటికే గుర్తించిన విషయం  తెలిసిందే. 

Read more RELATED
Recommended to you

Latest news