నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

-

బుధవారం సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ అసెంబ్లీ అభ్యర్థులను బిజెపి ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో ఎవరు ఎక్కడ నుండి పోటీ చేయాలి, ఎవరు ఏ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో నిలుస్తారు అనే విషయాలపై ఈ కీలక భేటీలో చర్చించనున్నారు. దీంతో ఎన్నికల బరిలో కమలం పార్టీ నుండి ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ కమిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితరులు ఉన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ఆ రాష్ట్రాలలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల గురించి కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి శివరాజ్ సింగ్ చౌహన్ కూడా రానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news