దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘దేశ ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణా’ అని ప్రధాని మోడీ హిందీలో ట్వీట్ చేశారు.
అదేవిధంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. “ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తుచేసుకుని ముందుకు సాగడమే. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీలమేఘశ్యాముని కృప, కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకుంటున్నాను” అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ధర్మపరిరక్షణార్థం… శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన భగవద్గీతనే… ప్రజా పాలనకు మార్గదర్శి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ధర్మపరిరక్షణార్థం…
శ్రీకృష్ణ పరమాత్ముడు
బోధించిన భగవద్గీతనే…
ప్రజా పాలనకు మార్గదర్శిఅందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు#Janmashtami #JanmashtamiWishes #Gokulashtami #Telangana pic.twitter.com/doHL37XK5C
— Revanth Reddy (@revanth_anumula) August 26, 2024