నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న వేళ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు బీఎస్పీ, జనసేన వంటి పార్టీలు కూడా ప్రచారం ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాష్ట్రానికి రానున్నారు. ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మ తరఫున ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం హంటర్‌ రోడ్డు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలో బహిరంగ సభ కోసం ప్రైవేటు స్థలాన్ని ఎంపిక చేశారు. పెద్దఎ త్తున జనసమీకరణలో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు. సభా ఏర్పాట్లను పార్టీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. 8 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టిన జనసేన ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కూడా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు ఈ నెల 25న తాండూరు, 26న కూకట్​పల్లి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లోనూ పాల్గొంటారు. ఈ ప్రచారాల్లో పవన్ బీఆర్ఎస్, కాంగ్రెస్​ పార్టీలపై ఎలాంటి విమర్శలు చేస్తారనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news