రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకున్న వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ప్రసంగిస్తూ బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని అంటున్నారు. రైతులకు సాయం చేయాలంటే పంటలకు, విత్తనాలకు భీమా పథకం తీసుకురావాలన్నారు. అలా జరగాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఓటర్లకు సూచిస్తున్నారు.
ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఇవాళ 5 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు నిజామాబాద్ రూరల్‌లో నిర్వహించే విజయభేరి సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30కు నారాయణ్‌ఖేడ్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గజ్వేల్‌లో పర్యటించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం 4.30 గంటలకు కూకట్‌పల్లిలో రోడ్ షోలో పాల్గొని.. 6 గంటలకు శేరిలింగంపల్లి రోడ్ షోలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.