తెలంగాణలో ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ భయ పడుతున్నాడా ?

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. కేవలం 15 రోజుల సమయం మాత్రమే ప్రచారానికి ఉంది. అయితే ఇప్పటివరకు కూడా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయలేదు. ఈ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన మరియు బిజెపి పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

pawan kalyan no compaign in telangana
pawan kalyan no compaign in telangana

పొత్తులో భాగంగా ఎనిమిది సీట్లను జనసేనకు కేటాయించింది బిజెపి. ఈ తరుణంలో అభ్యర్థులు నామినేషన్లు వేసి ఎన్నికల ప్రచారాన్ని చేసుకుంటున్నారు. కానీ జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ప్రచారానికి రావడం లేదు. అసలు జనసేన పార్టీని గెలిపించుకునే దిశగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అటు బిజెపి నేతలు కూడా… ప్రచారానికి పవన్ కళ్యాణ్ రావాలని కోరడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news