తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఊహించని పరిణామం ఎదురైంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో మాజీ సీఎం కేసీఆర్ ను హైదరాబాద్ సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాత్రి ఆయన బాత్ రూంలో పడడంతో తుంటి ఎముక విరిగి గాయమైంది.
ఎడమ కాలుకు ఈ గాయం అయినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ఆయనను చేర్చారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎడమకాలు తుంటె ఎముక విరిగిపోయింది. దీంతో ఇవాళ సాయంత్రం హిల్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేస్తున్నారు.
కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కేసీఆర్ కు గాయమైందని తెలిసి బాధపడ్డాను. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎన్నో సవాళ్లను అధిగమించిన కేసీఆర్ ఈ అనారోగ్య పరిస్థితులనూ మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం ఉంది. పూర్తి స్వస్థత పొంది మళ్ళీ ప్రజలకు, సమాజానికీ తన సేవలు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నాను.