మల్కాజిగిరి పార్లమెంటు నేతలతో సమావేశం కానున్న సీఎం రేవంత్‌రెడ్డి

-

లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఓవైపు అభ్యర్థుల ప్రకటనపై దృష్టి సారిస్తూనే మరోవైపు ప్రచార వ్యూహాలు రచిస్తోంది. ఇంకోవైపు ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంటూ నియోజకవర్గాల్లో బలమైన ఫాలోయింగ్ వారిని బరిలోకి దింపుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కేవలం నాలుగు స్థానాలకు అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. మిగతా వాటిపై కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఆరు స్థానాలపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం.

మరోవైపు సీఎం రేవంత్‌ రెడ్డి సిట్టింగ్‌ స్థానమైన మల్కాజిగిరి పార్లమెంటులోని ఏడు నియోజకవర్గాలకు చెందిన నేతలతో ఇవాళ ఆయన భేటీ కానున్నారు. లోక్‌సభ బరిలో దిగే అభ్యర్థి ఎంపికపై నేతలతో చర్చించనున్నారు. నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులను సమీక్షించి ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. అయితే ఈ ఎంపీ సీటును ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన సునీతా మహేందర్ రెడ్డికి ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది. దీనిపై క్లారిటీ రావాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version