వివాదంలో పెద్దపల్లి ఎమ్మెల్యే..గన్‌ పట్టుకుని కొండగట్టు గుడిలోకి !

-

పెద్దపల్లి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విజయ రమణారావు వివాదంలో చిక్కుకున్నారు. హానుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలోకి ఆయుధంతో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గన్ మెన్ ప్రవేశించారు. కొండగట్టు ఆలయంలోకి ఆయుధం తో ప్రవేశించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గన్ మెన్.

Peddapalli MLA Vijaya Ramana Rao who entered the Kondagattu temple with a weapon was a gunman

ఆలయంలోకి ఆయుధం తో వెళ్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడి నుంచి వెనుదిరిగారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. ఇక అటు నేడు కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉంది. దీంతో భారీగా కొండగట్టుకు హనుమాన్ భక్తులు తరలివస్తున్నారు. అంజనేయస్వామిని దర్శించుకుంటున్నారు హనుమాన్ దీక్ష పరులు.ఆలయ ప్రాంగణంలో జై శ్రీ రామ్ జై హనుమాన్ నినాదాలు చేస్తున్నారు హనుమాన్‌ భక్తులు. దీంతో కొండగట్టులో భారీగా నిలిచింది ట్రాఫిక్. అటు కొండగట్టు అంజన్న దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నేడు మాల విరమణ చేయనున్నారు హనుమాన్ దీక్ష పరులు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news