కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది : అమిత్ షా

-

దేశ వ్యాప్తంగా ఇప్పటికే 6 దశల్లో ఎన్నికలు పూర్తికాగా.. ఇవాళ చివరి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిల్ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాల గురించి చర్చకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తాజాగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని తెలిపారు.

రాహుల్ గాంధీ పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడం ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ తిరస్కరణకు గురవుతోందని తెలిపారు. కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు సాధిస్తుందని ప్రచారం చేసింది.. కానీ ఇప్పుడు వాస్తవికతను గ్రహించింది. ఎగ్జిట్ పోల్ అంచనా పై మీడియా అడిగే ప్రశ్నలకు కాంగ్రెస్ వద్ద సమాధానం లేకనే బహష్కరిస్తున్నారని పేర్కొన్నారు. న్యాయపరమైన తీర్పులు, ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేనప్పుడు సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ పై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని తెలిపారు. బీజేపీ అనేక సర్వేల్లో ఓడిపోయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ను ఏనాడు బహిష్కరించలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news