ప్రజలే కేసీఆర్ “బలం – బలగం” – ఎమ్మెల్యే సండ్ర

-

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరం గ్రామంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ గేటు తాకనివ్వను అని అంటున్నారని.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో రాజకీయ కక్ష సాధింపు ఏమైనా మేము చేస్తున్నామా..? అని ప్రశ్నించారు. కెసిఆర్ ఏ తప్పు చేశాడని విమర్శిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే సండ్ర.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉందన్నారు. ప్రజల కోసం కృషి చేస్తున్న కేసీఆర్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైనే ఉందన్నారు. ప్రజలే కెసిఆర్ “బలం – బలగం” అని.. ఆయన ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పి ప్రజల మన్ననలు పొందాలని చూడడం లేదన్నారు. ఓట్ల కోసం రాజకీయం చేయట్లేదని అన్నారు. ప్రజల మధ్యనే ఉన్నాం.. ప్రజల కోసమే బతుకుతున్నాం.. “మీరే మా బలం – మా బలగం” అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version