‘హైడ్రా’ రద్దుపై హైకోర్టులో పిటిషన్..నేడు విచారణ!

-

గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. చెరువు భూములను కబ్జా చేసి నిర్మించిన భవనాలపై హైడ్రా అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. అయితే, హైడ్రా చర్యలపై ఆది నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా పక్షపాతంగా వ్యవహరిస్తోందని, కొందరు వ్యక్తులే టార్గెట్‌గా చేసుకుని కూల్చివేతలకు పాల్పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

హైడ్రా ఏర్పాటు కోసం ఇచ్చిన జీవో నంబర్ 99ను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.ఆ జీఓను కొట్టివేయాలని రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలవ్వగా.. మంగళవారం హైకోర్టు విచారణ చేయనుంది. హైడ్రాకు చట్టబద్ధత లేదని,అందులోని జీఓ 99ని రద్దు చేయాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, సోమవారం జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏ కట్టడాన్ని కూల్చివేసినా ‘రూల్ ఆఫ్ లా’ను ఫాలో అవ్వాలని స్పష్టంచేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news