జనగామ జిల్లాలోని ఓ పెట్రోల్ బంక్ లో నిర్వాహకులు ఘరానా మోసానికి పాలపడ్డారు. వినియోగదారులకు పెట్రోల్ కు బదులు నీళ్లు పోస్తూ మోసం చేస్తున్నారు. జనగామ జిల్లా యశ్వంతపూర్ శివారులో ఉన్న వెంకట సాయి ఫిల్లింగ్ స్టేషన్లో బైక్ లో పెట్రోల్ పోయించుకున్నాడు పెంబర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి. అయితే బంకు నుండి కొంత దూరం వెళ్ళాక బండి ఆగిపోయింది.
అయితే నది స్టార్ట్ చేయడానికి ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడంతో బైక్ లోని పెట్రోల్ ను ఓ బాటిల్లో నింపి బయటకు తీసాడు. దాంతో పెట్రోల్ లో నీరు కలిసినట్టు గుర్తించాడు. ఆ తర్వాత వెన్నకి వెళ్లి.. పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని నిలదీయగా తమ తప్పు లేదని నిర్లక్ష్యపు సమాధానం చెప్పారని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ విషయంలో వెంటనే అధికారుల స్పందించి సంబంధిత బంకుపై చర్యలు తీసుకోవాలని అక్కడికి వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.