ఒలింపిక్స్ ప్లేయర్లతో ప్రధాని మోదీ ముచ్చట

-

 78వ స్వాత్రంత్య్ర దినోత్సవ సంబరాుల్లో భాగంగా భారత ఒలింపిక్‌ క్రీడా బృందంతో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. క్రీడాకారులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో వారి ప్రదర్శనను అభినందించారు. ప్లేయర్లతో కలిసి ఫొటోలు దిగగా.. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

ఈ సమావేశంలో షూటర్ మను బాకర్​ ప్రధానితో ప్రత్యేకంగా ముచ్చటించింది. తాను ఒలింపిక్స్​లో వాడిన పిస్టోల్​ను చూపిస్తూ మురిసిపోయింది. ఆ తర్వాత హాకీ పురుషుల జట్టు ప్రధానికి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ప్లేయర్లంతా సంతకం చేసిన ఓ జెర్సీ, హాకీ స్టిక్‌ను మోదీకి బహుమతిగా అందించగా..  యంగ్ రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ కూడా భారత జెర్సీని ప్రధానికి గిప్ట్​ గా ఇచ్చాడు.

ఇక దిల్లీ ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం మోదీ ప్రసంగిస్తూ.. 2036లో ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ రెడీగా ఉందని తెలిపారు. ఈ విశ్వక్రీడల్లో పోటీ పడిన అథ్లెట్లను అభినందిస్తూ.. పారా ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news