దయచేసి ఉండండి సారూ.. ఉపాధ్యాయుడి కాళ్ళపై పడి ఏడ్చేసిన విద్యార్థులు.!

-

మంచిగా విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిని విద్యార్థులు ఎంతగానో ప్రేమిస్తారు. అదే ఉపాధ్యాయుడు బదిలీ అయితే కంటతడి పెట్టుకుంటున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో ఇలాంటే ఘటనే జరిగింది. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లల భావోద్వేగం చెందారు. తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ ను పట్టుకుని ఏడ్చేశారు.

సూర్యపేట జిల్లా మద్దిరాల మండలంలోని  పోలుమల్ల గ్రామంలో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు మెంతబోయిన సైదులు పని చేస్తున్నాడు. అయితే ఆయన తాజాగా ఉపాధ్యాయుల బదిలీలో భాగంగా  వేరే ఊరికి బదిలీ అయ్యారు. ఈ క్రమంలో విద్యార్థులకు సెండ్ ఆఫ్ చెబుతూ స్వీట్స్ ఇస్తూ మంచిగా చదువుకోవాలని సూచించారు. అయితే, వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ ను పట్టుకొని ఏడ్చారు. ఉపాధ్యాయుడి కాళ్ళపై పడి ఇక్కడే ఉండాలంటూ విద్యార్థులు ప్రాధేయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news