PM KISHAN : రైతులకు శుభవార్త…ఎల్లుండి అకౌంట్లలోకి రూ.2,000 !

-

PM KISHAN : రైతులకు శుభవార్త…ఎల్లుండి రైతుల అకౌంట్లలోకి రూ.2,000 పడనున్నాయి. రైతుల కుటుంబాలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ప్రతి ఏటా 6000 రూపాయలు అందిస్తుంది. పంట పెట్టుబడికి, ఎరువులు కొనుగోలుకు, వ్యవసాయానికి సంబంధించి ఆర్థిక సాయం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం.

పీఎం కిసాన్ పథకం కింద భూమి కలిగి ఉన్న ప్రతి రైతుల కుటుంబాలకు ప్రతి ఏడాది నాలుగు నెలలకు ఒకసారి 2000 చొప్పున మూడు సమాన వాయిదాలలో రూ. 6000 ఆర్థిక సాయం చేయనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం….. లబ్ధిదారులు వారి బ్యాంకు ఖాతా వివరాలను ఆధార్ నంబరుతో అనుసంధానం చేయాలని సూచించింది. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన (PM-KISAN)కి సంబంధించిన 15వ విడత డబ్బులను ఎల్లుండి రైతుల ఖాతాలో జమ చేయనుంది. దీపావళి తర్వాత అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు ఈ ఏడాది జులైలో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కి సంబంధించిన 14వ విడత నిధులను విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news