ఈనెల 19 సికింద్రాబాద్‌-విశాఖ ‘వందే భారత్‌’ రైలు ప్రారంభం

-

తెలుగు రాష్ట్ర ప్రజల ప్రయాణ సౌకర్యార్థం సికింద్రాబాద్‌-విశాఖపట్నం, విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్‌ రైలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 19న హైదరాబాద్‌ పర్యటనకు రానున్న ప్రధాన మంత్రి మోదీ ఆరోజునే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనున్నారు. ఈ విషయాన్నికేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్విటర్ వేదికగా వెల్లడించారు.

సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే ఈ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో తయారయ్యే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లకు గరిష్ఠంగా 180 కిమీ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఇవి ఇప్పటివరకు నాలుగు పట్టాలెక్కాయి. అయిదోది మైసూర్‌-బెంగళూరు-చెన్నై రైలు గతేడాది నవంబర్‌ 10న పట్టాలు ఎక్కింది. దక్షిణ భారతానికి ఇదే తొలి రైలు. ఆరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తెలుగు రాష్ట్రాల మధ్య సేవలందించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news