తెలంగాణ డీజీపీ సస్పెన్షన్.. కొత్త డీజీపీ రాక..!

-

తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజన్ కుమార్ ను ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసినట్టు పిటిఐ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే అధికారికంగా టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరపరమే అంజనీ కుమార్ సస్పెన్షన్ ప్రధాన కారణమని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఎన్నికల ఫలితాలు కూడా రాకముందే రేవంత్ రెడ్డితో భేటీ కావడమే డిజిపి పై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం.

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని పూలబోకేతో కలవడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని బిజెపి అంజని కుమార్ పై సస్పెన్షన్ వేటు వేశారు. బీజేపీతో పాటు సిఐడి చీఫ్ మహేష్ భగవత్ మరో పోలీసు ఉన్నతాధికారి సంజయ్ కుమార్ లకు శోకాజు నోటీసులు జారీచేసింది ఈసీ. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా డిజిపి ఇలా కలవటమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎన్నికల కోడ్ ఐదో తేదీ వరకు ఉన్న నేపథ్యంలో గెలిచిన అభ్యర్థుల జాబితా ఇంకా పెండింగ్ లోనే ఉండగానే ఇలా రేవంత్ రెడ్డితో అధికార హోదాలో బిజెపి కలవటం వేటుకు కారణమైంది బిజెపి అంజనీకుమాను సస్పెండ్ చేసిన నేపథ్యంలోనే తదుపరి డీజీపీగా జితేందర్ ను ఎంపిక చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news