బాల్క సుమన్ పై కేసులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పెట్టించారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కలవడానికి వెళ్లిన బాల్క సుమన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
బాల్క సుమన్‌ను అరెస్టు చేశారు పోలీసులు. ఈ తరుణంలోనే…పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు వెస్ట్ జోన్ డిసిపి ఐపీఎస్ విజయకుమార్. టిఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోచారం ఇంట్లోకి చొరబడిన తీరును..ఆయననే అడిగి తెలుసుకుంటున్నారు డిసిపి విజయకుమార్. బాల్క సుమన్ తో పాటు టిఆర్ఎస్ నేతలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు డిసిపి విజయ్ కుమార్. సెక్యూరిటీ ఫెయిల్యూర్ పై ఆరా తీస్తున్న డిసిపి విజయ్ కుమార్…బాల్కసుమన్ పై యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.