సిద్దిపేట లో టెన్షన్.. సీఎం ఫ్లెక్సీతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి కాంగ్రెస్ నాయకులు..!

-

సిద్దిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అలాగే MLA హరీష్ రావ్ మధ్య జరిగిన మతాల యుద్ధం గురించి అందరికి తెలిసిందే. దమ్ముంటే హరీష్ రావ్ రాజీనామా చెయ్యాలని సీఎం సవాల్ విసిరారు. ఈ క్రమంలో సీఎం ఫ్లెక్సీని తీసుకుని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి బైక్ ర్యాలీగా బయలుదేరారు కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని పెట్టాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ ఎందుకు ఉంటుందని నాయకులు ప్రశ్నిస్తున్నారు.

అయితే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కాంగ్రెస్ నాయకులకు.. పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో సిద్దిపేట కాంగ్రెస్ ఇంచార్జ్ పూజల హరికృష్ణతో పాటు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసారు పోలీసులు. వారిని పోలీస్ వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ క్రమంలో మరికొందరు కాంగ్రెస్ నాయకులు పోలీసుల వద్ద నుండి తప్పించుకొని పారిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version