రుణం తీరలే.. రైతు బతుకు మారలే.. కేటీఆర్ సంచలన ట్వీట్..!

-

కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు విడుతల్లో నిధులను విడుదల చేసింది. ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రూ.2లక్షల లోపు రుణమాఫీ నిధులను విడుదల చేశారు. రుణమాఫీ పై బీఆర్ఎస్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక కేటీఆర్ తాజాగా ఓ ట్వీట్ చేశారు.

“రుణం తీరలే..  రైతు బతుకు మారలే. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) లెక్క రూ. 49,500 కోట్లు అని, కేబినెట్ భేటీలో చెప్పింది రూ. 31 వేల కోట్లు. బడ్జెట్లో కేటాయించింది రూ. 26 వేల కోట్లు. 3 విడతల వారీగా కలిపి ఇచ్చింది రూ. 17933 కోట్లు. ఒకే విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు .. నిలదీస్తే బెదిరింపులు. అయినా తగ్గేదే లేదు.. నిగ్గదీసి అడుగుతాం.. నిజాలే చెపుతాం కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటాం” అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు సిద్దిపేట ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version