Police checked the bus of former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ బస్సును తనిఖీ చేశారు పోలీసులు. దేవరుప్పల మండలం ధరావత్ తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్…అనంతరం సూర్యపేట వైపునకు బయలు దేరారు. ఈ తరుణంలోనే…మాజీ సీఎం కేసీఆర్ బస్సును తనిఖీ చేశారు పోలీసులు.

సూర్యాపేట జిల్లా ఈదుల పర్రె తండా చెక్ పోస్ట్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు…అనంతరం బస్సులో ఏం లేకపోవడంతో వెనుదిరిగారు. కాగా కేసీఆర్ వెంట 100కు పైగా కార్లతో బయలుదేరింది గులాబీ దండు. నీళ్లందక ఎండిన పంటలను పరిశీలించి రైతన్నల కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని నింపేందుకు క్షేత్రస్థాయి పర్యటన కోసం బయలుదేరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.