పింఛన్ల పంపిణీ విషయంలో టీడీపీ పై వైసీపీ విష ప్రచారం : అచ్చెన్నాయుడు

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి. అధికార వైసీపీ ప్రభుత్వం మేము రాష్ట్రాన్ని చాలా అభివృద్ది చేశామని.. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమాలో వైసీపీ ఉంటే.. ఏపీలో అసలు అభివృద్ధి చేసిందే టీడీపీ.. వైసీపీ హయాంలో ఏం అభివృద్ధి జరుగలేదని..ఒకరిపై మరొకరూ విమర్శించుకోవడం గమనార్హం. 

తాజాగా పింఛన్లు పంపిణీ చేయకుండా టీడీపీ అడ్డుపడుతోందంటూ వైకాపా విష ప్రచారం చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు  ఆరోపించారు. వైకాపా నేతలు ఎన్నికల సంఘం ఆదేశాలను వక్రీకరించి వాలంటీర్లకు వాయిస్ మెసేజ్లు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం వల్లే పింఛను పంపిణీ నిలిపివేసినట్లు పెన్షన్ దారులకు చెప్పాలని ఆదేశాలిచ్చారని.. మండిపడ్డారు. పింఛన్ల రూపంలో ఇవ్వాల్సిన రూ. 2వేల కోట్లను బిల్లుల రూపంలో సీఎం జగన్, మంత్రి బుగ్గన తమ అస్మదీయులకు చెల్లించారన్నారు. ఖజానాలో డబ్బు లేకుండా చేసి ఇప్పుడు తమపై అభాండాలు వేస్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news