ఖమ్మం జిల్లా చంద్రాయ పాళెంలో ఉద్రిక్తత.. పోలీసులపై కర్రలతో దాడి..!

-

పోడు భూముల వివాదంలో పోలీసులని ఉరికిచ్చి కొట్టిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు లోని చంద్రాయపాలెం గ్రామంలో పోడు భూముల వ్యవహారంలో అక్కడ ఉన్న రెండు గిరిజన వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గిరిజనుల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపేందుకు సత్తుపల్లి నుంచి పోలీసులు చేరుకున్నారు. సత్తుపల్లి సిఐ కిరణ్ ఆధ్వర్యంలో సమస్యని పరిష్కరించడం కోసం ఇరువర్గాలని సమన్వయ పరచడానికి ప్రయత్నం చేశారు. ఈ సమన్వయ పరిచే సందర్భంగా గిరిజనుల్లో ఒక వర్గం కర్రలు తీసుకొని పోలీసులపై దాడికి పాల్పడింది. అటవీ ప్రాంతంలోనే గిరిజనులు పెద్ద పెద్ద కర్రలతో సీఐతో పాటు వున్న పోలీసుల అక్కడి నుంచి ఉరికించారు. అంతేకాకుండా.. వారిపై దాడికి పాల్పడ్డారు.

దీంతో కొంతమంది పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా వారి వెంటపడి గిరిజనులు తరుముకుంటూ వెళ్లారు. పెద్ద పెద్ద కర్రలతో గిరిజనులు ఒక్కసారిగా పోలీసుల మీద పడటంతో పోలీసులు పరుగులు పెట్టారు. గిరజనులకు ఎంత చెప్పినా వినకపోవడంతో.. ఇక పోలీసులు కూడా చేతులెత్తేసారు.. అక్కడి నుంచి పరుగులు పెడుతూ వచ్చారు. వారి మోటార్ బైక్ పై ఎక్కి వెళ్ళిపోతున్న పోలీసులు సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులపై కూడా వెంట తరిమి వారిపై కూడా దాడి చేశారు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితిలో పోలీసులు మోటార్ బైక్ నుంచి దిగి వారిని గిరిజనులని బ్రతిమిలాడు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు గిరిజన వర్గాల మధ్య ఉన్న విభేదాన్ని పరిష్కరించడానికి వెళ్లిన పోలీసులుకి గిరిజనుల దాడిలో తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే అసలు పోడు భూముల విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం ఎందుకు తలెత్తింది అనేదానిపై ఆరా తీస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకునే లోపే ఇరువర్గాలు ఇలా దాడి చేయడంపై దర్యాప్తు సిద్దమయ్యారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news